కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జోరుగా పడుతున్న వర్షాలతో వంకలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నంద్యాల జిల్లాలో శుక్రవారం కూడా వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.