నంద్యాలలో ముస్లింల శాంతి ర్యాలీ సోమవారం నంద్యాల గాంధీ చౌక్ నుండి ప్రారంభించారు. వక్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీకి భారీ గా ముస్లింలు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నమ్మించి మోసం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో ఓటు రూపంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారీగా ముస్లిం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.