నంద్యాల: దొంగతనం కేసులలో ముద్దాయిలు అరెస్టు

81చూసినవారు
నంద్యాల: దొంగతనం కేసులలో ముద్దాయిలు అరెస్టు
నంద్యాల జిల్లా పోలీసులు శనివారం ముద్దాయిలను అరెస్ట్ చేశారు. విజయనగరం, ప్రకాశం జిల్లాలతో పాటు నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇంటి తాళాలు పగలగొట్టి జరిగిన దొంగతనాల కేసుల్లో వారు అరెస్టయ్యారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు వివరాలు వెల్లడించారు. రూ.39 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్