నంద్యాల: 2026 పద్మ పురస్కారాలకై దరఖాస్తులకు ఆహ్వానం

60చూసినవారు
నంద్యాల: 2026 పద్మ పురస్కారాలకై దరఖాస్తులకు ఆహ్వానం
2026 రిపబ్లిక్ డే వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ పురస్కారాలకై క్రీడాకారుల నుండి దరఖాస్తులను కోరుతున్నట్లు బుధవారం నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం. ఎన్. వి రాజు తెలిపారు. అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు వివరాలను www. padamawards. gov. in అనే వెబ్ సైట్ ద్వారా పొందవచ్చునని తెలిపారు. మే 26 తేదీ లోపల దరఖాస్తులను పంపాలని కోరారు.

సంబంధిత పోస్ట్