నంద్యాల జిల్లా దేశీయోత్పత్తి 2024-25 కు రూ. 43, 630 కోట్ల మేరకు సాధించడం జరిగిందని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 కు రూ. 50, 711 కోట్ల మేరకు పెంచేలా బ్యాంకర్లు సహాయ సహకారాలు అందజేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పై జిల్లా కమ్యూలేటివ్ కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు.