నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల సమాచారం అందించవచ్చు. ఈగల్ టీంలు కార్యకలాపాలు ప్రారంభించగా, క్యూఆర్ కోడ్ లను స్టేషన్లలో, కూడళ్లలో ప్రదర్శిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో సమాచారం సేకరించేందుకు ఇది వినియోగించనున్నారు.