నంద్యాల జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బ్యాంకు మేనేజర్లకు కలెక్టర్ రాజకుమారి సూచించారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్‌లో జరిగిన బ్యాంకు మేనేజర్ల జిల్లా ఓరియంటేషన్ వర్క్‌షాప్‌లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, పర్యాటక రంగం, బలహీన వర్గాల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రాథమిక రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి రుణాలు మంజూరు చేయాలని సూచించారు.