దేశంలోని బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సమరభేరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇంచార్జ్ గద్దల లాజర్ మౌలాలి, ఉపాధ్యక్షుడు రమణ, నాయకులు చంద్రశేఖర్, భాస్కర్, చిన్నయ్యలతోపాటు వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.