నంద్యాల: 17వ రోజుకు చేరుకున్న సీహెచ్ఓల సమ్మె

52చూసినవారు
నంద్యాల: 17వ రోజుకు చేరుకున్న సీహెచ్ఓల సమ్మె
రెండేళ్లుగా అణిచివేతకు గురిచేస్తూ.. జీతాలు, ఇన్సెంటివ్‌ లు పెంచకుండా ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ ఉద్యోగులైనటువంటి కమ్యూనిటీ ఆరోగ్య అధికారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ / కమ్యూనిటీ హెల్త్‌ అధికారుల అసోసియేషన్‌ (ఎ పి ఏం సి ఎ) నంద్యాల జిల్లా ప్రసిడెంట్‌ కె. శివ శంకర్‌ పేర్కొన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని బి యస్‌ యన్‌ ఎల్‌ కార్యాలయం దగ్గర గత 17 రోజులుగా కమ్యూనిటీ ఆరోగ్య అధికారుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె బాట కొనసాగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్