నంద్యాల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర అతిథి గృహానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడుని జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా గురువారం కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పీకర్ కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పరిపాలన, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు వారు తెలిపారు.