నంద్యాల: హోంగార్డుల కవాతును పర్యవేక్షించిన కమాండెంట్ మహేష్

80చూసినవారు
నంద్యాల: హోంగార్డుల కవాతును పర్యవేక్షించిన కమాండెంట్ మహేష్
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు బుధవారం హోంగార్డుల యూనిట్‌ను హోమ్ గార్డ్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ పరిశీలించారు. 60 మంది హోంగార్డుల కవాతును పర్యవేక్షించి గౌరవ వందనం స్వీకరించారు. బీమా పాలసీ, డ్రైవింగ్ లైసెన్సు అవసరం, PMJJBY & PMSBY లు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. హోంగార్డులు పోలీసులకు వెన్నుదన్నుగా పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్