నంద్యాల జిల్లాలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అమలుపై శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడారు. ఎంపిక చేసిన గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. గ్రామీణ జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.