రాష్ట్రవ్యాప్తంగా ఆప్కాస్ లో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులందరికీ రూ. 21వేల వేతనాలు చెల్లించాలని కోరుతూ నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి అందజేశారు. కార్మికులు తదితరులు పాల్గొన్నారు.