వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన కిట్లను పంపిణీ చేసామని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి శాఖ అధికారి ఎం. ఎన్. వి. రాజు, శిక్షకులు, క్యాంపు కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.