నంద్యాల: దివ్యాంగులకు మందుల పంపిణీ

54చూసినవారు
నంద్యాల: దివ్యాంగులకు మందుల పంపిణీ
రాష్ట్ర మంత్రి ఫరూక్ 75వ జన్మదినోత్సవం పురస్కరించుకుని నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, సంఘం కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ సౌజన్యంతో దివ్యాంగులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు అతిథులుగా పాల్గొని 20 మంది దివ్యాంగులకు 15వేల రూపాయల విలువ చేసే నెలవారి మందులను గురువారం అందజేశారు.

సంబంధిత పోస్ట్