నంద్యాల పట్టణం, అయ్యలూరు మెట్ట నందుగల నవజీవన్ బదిరుల పాఠశాలకు విశ్రాంత లెక్చరర్ జనార్ధన రెడ్డి సౌజన్యంతో క్రీడా పరికరాలను శుక్రవారం పంపిణీ చేశారు. దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలకు వివిధ సేవా కార్యక్రమాలను, సహాయ సహకారాలను భవిష్యత్ లో కూడా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. డాక్టర్లు రవి కృష్ణ, శశికళ, రవికాంత్ రెడ్డి పాల్గొన్నారు.