నంద్యాల నంది పైప్స్ బాడ్మింటన్ అకాడమీ నందు గత రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి జిల్లా స్థాయి. షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. నంది గ్రూప్ అధినేత్రి సుజల ఈపోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రదానోత్సవం గావించారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు వంశిధర్ మాట్లాడుతూ ఈ పోటీలలో ఉమ్మడి జిల్లా నుండి దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.