నంద్యాల: డాక్టర్ రవికృష్ణకు కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారం

70చూసినవారు
నంద్యాల: డాక్టర్  రవికృష్ణకు కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారం
కందుకూరి వీరేశలింగం 177వ జయంతి, ఏప్రిల్ 16 వ తేదీన తెలుగు నాటక రంగ దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కందుకూరి రాష్ట్రస్థాయి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాలను మంగళవారం విజయవాడలో ప్రకటించింది. రాష్ట్రస్థాయి పురస్కారానికి ముగ్గురిని ఎంపిక చేయగా అందులో నంద్యాలకు చెందిన డాక్టర్ గుర్రాల రవికృష్ణ ఒకరు. ప్రశంసా పత్రం, లక్ష రూపాయల నగదు బహుమతితో రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తుంది

సంబంధిత పోస్ట్