నంద్యాల మెడికల్ కాలేజ్ కొత్త ప్రిన్సిపల్‌గా డాక్టర్ ఎ. సురేఖ నియమితులయ్యారు. గతంలో కడప మెడికల్ కాలేజ్‌లో సేవలందించిన ఆమె బదిలీపై నంద్యాలకు వచ్చారు. కళాశాలలో వసతులు తక్కువగా ఉన్నా, సిబ్బంది సహకారంతో అన్ని మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో పీజీ విద్యార్థిని డాక్టర్ లింషా ముస్తఫా చేసిన పరిశోధనకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి ఉత్తమ పరిశోధన ప్రశంసాపత్రం లభించిందని వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బాలేస్వరి మంగళవారం పేర్కొన్నారు.