అమృత్ భారత స్టేషన్ అభివృద్ధి పనుల్లో భాగంగా సోమవారం గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ సుధేష్ణ సేన్ నంద్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల సెక్షన్ లోని సాతులూరు, నరసరావుపేట, దొనకొండ మార్కాపురం స్టేషన్లను తనిఖీ చేశారు.