నంద్యాల జిల్లాలో బడిఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అక్కడే విద్యనభ్యసించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులు, మండల, నియోజకవర్గ స్పెషల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ఎంఈఓలు, తహశీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ఆర్డీఓలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.