నంద్యాల పట్టణం, హౌసింగ్ బోర్డ్ కాలనీలోని స్పటికలింగేశ్వరలయం నందు బుధవారం జేష్ట మాస పౌర్ణమి మరియు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు. వర్షఋతువులో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమ నాడు తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారాని నిర్వాహకులు యోగానంద తెలిపారు. రైతులు సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించినట్లు తెలిపారు. పూర్ణాహుతి అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు.