ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల తిరుపతి దేవస్థానంపై భూమన కరుణాకరరెడ్డి తప్పుడు ప్రచారం చేయడం తగదని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సోమవారం అన్నారు. ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కరుణాకరరెడ్డి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.