పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని నంద్యాల పట్టణం బొమ్మల సత్రం కూడలిలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.