నంద్యాల: స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు సహకరించండి

78చూసినవారు
నంద్యాల: స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు సహకరించండి
స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను నంద్యాల జిల్లా రెవెన్యూ అధికారి డి. రాము నాయక్ శనివారం కోరారు. నంద్యాల డిఆర్ఓ ఛాంబర్ లో ఓటర్ల జాబితా రూపకల్పన పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. బీఎస్పీ పార్టీ ప్రతినిధి కొట్టం శ్రీనివాసులు, సిపిఎం పార్టీ ప్రతినిధి పి. నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్