నంద్యాల కోర్టు ప్రాంగణంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 418 ఓట్లకు గాను 389 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల కమిటీ సభ్యులు తెలిపారు. అధ్యక్షునిగా హుస్సేన్ భాష, జనరల్ సెక్రటరీగా ఎం. ఆర్ కృష్ణారెడ్డి, స్పోర్ట్స్ సెక్రటరీగా చిన్న లింగమయ్య, జాయింట్ సెక్రటరీగా బాలు నాయక్ ఎన్నికయ్యారు. ఎన్నికైన వారికి న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఉపాధ్యక్షులుగా కానాల సుబ్బరాయుడు, కోశాధికారిగా మద్దిలేటి రెడ్డి, లైబ్రరీ సెక్రటరీగా మద్దిలేటి యాదవ్, మహిళా ప్రతినిధిగా సౌజన్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.