ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. నంద్యాల జిల్లాలో ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారని ఆదివారం విద్యాశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. నంద్యాల జిల్లాలో 35 సెంటర్లలో 8, 000 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ఎంపీసీ 5000, బైపీసీ 300 మందికి పరీక్షలు జరుగుతాయి.