నంద్యాల కురువ సంఘం క్యాలెండర్ ను ఆదివారం సభ్యులు ఘనంగా ఆవిష్కరించారు. నంద్యాల పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కురువ కులస్తులు హాజరయ్యారు. కురువ సంఘం నాయకులు, బిల్లలాపురం గ్రామ పెద్ద సంకల శ్రీరాములు మాట్లాడుతూ కురువ కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడ్డారని తెలిపారు. వారందరిని ఏకత్రాటిపైకి తెచ్చి వారి అభివృద్ధికి కృషి చేస్తున్న కురువ సంఘం సభ్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు.