నంద్యాల: వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దండి

70చూసినవారు
నంద్యాల: వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దండి
నంద్యాల జిల్లాలో వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ఉల్లాస పథకాన్ని క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని డిఆర్ఓ ఛాంబర్ లో ఉల్లాస్ కార్యక్రమంపై జిల్లా స్థాయి కమిటీ కన్వర్జేన్స్ మీటింగ్ నిర్వహించారు. డీఆర్డీఏ పిడి శ్రీధర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్