సిద్దేశ్వరం అలుగు 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 31న సంగమేశ్వరంలో నిర్వహించే ప్రజా బహిరంగ సభ విజయవంతంలో భాగంగా గురువారం నంద్యాల సమితి కార్యాలయంలో గోడపత్రికలను సమితి కార్యవర్గ సభ్యులు విడుదల చేసారు. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ 2009 సంవత్సరంలో వచ్చిన వరదల ప్రభావంతో శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర భారీ గొయ్యి ఏర్పడంతో శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు.