నంద్యాల జిల్లాలో ఈ నెల 10వ తేదీన జరిగే మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో తల్లిదండ్రులు భాగస్వాములై విద్యార్థిని, విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల అభివృద్ధికి సంబంధించిన చర్చలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1336 ప్రభుత్వ పాఠశాలలు, 619 ప్రైవేటు పాఠశాలలు మొత్తంగా 1959 పాఠశాలల్లో కూడా ఈ నెల 10న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు.