APUWJ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఖండే శ్యాం సుందర్ లాల్‌పై జరిగిన దాడికి ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 17న కర్నూలుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి యూనియన్ తరఫున మెమోరాండం ఇవ్వాలని మంగళవారం యూనియన్ పెద్దలు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను కలిసి వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి సీఎం చంద్రబాబును కలిసే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.