నంద్యాల బొమ్మల సత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో శనివారం బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణి చేశారు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ పేద రోగులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు, నిరుపేద రోగులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అవసరమైన రోగులకు త్వరగా విడుదల చేస్తూ భరోసా కల్పిస్తున్నారన్నారు.