నంద్యాల: 25న మానవహారం కార్యక్రమానికి మద్దతుగా ముస్లిం జేఏసీ

50చూసినవారు
నంద్యాల: 25న మానవహారం కార్యక్రమానికి మద్దతుగా ముస్లిం జేఏసీ
నంద్యాల డబ్రా మస్జిద్‌లో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ, శంషుల్ ఉలేమా ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు జరిగింది. అధ్యక్షత వహించిన మౌలానా అబ్దుల్లా రశాది మాట్లాడుతూ... ఈ నెల 25న "ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్" దేశవ్యాప్తంగా మానవహారం కార్యక్రమం చేపట్టనుందని తెలిపారు. పలువురు మత, సామాజిక నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్