జూపాడుబంగ్లా మండలం, తర్తూరు గ్రామంలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపి గువ్వల నాగశేషులు అనే వ్యక్తి వద్ద 5 లీటర్ల నాటుసారా సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై జఫరుల్లా శ్రీనివాసులు తెలిపారు. పగిడ్యాల మండలం, నెహ్రూ నగర్ గ్రామంలో రవీంద్ర గౌడ్ అనే వ్యక్తి వద్ద 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని తెలిపారు.