నవోదయం 2. 0 ద్వారా జిల్లాలో నాటు సారా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా రెవెన్యూ అధికారి డి. రాము నాయక్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నవోదయం 2. 0 కార్యక్రమ పటిష్ట అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, డిఎంహెచ్ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.