తెలుగుదేశం సీనియర్ నేత, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ ఎన్ఎండి ఫరూక్ 75వ జన్మదిన వేడుకలు నంద్యాల పట్టణం రైతునగరం సమీపంలోని ప్రతిభ ఓల్డ్ ఏజ్ హోంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫరూక్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని వారు ఆకాంక్షించారు.