నంద్యాల: హైస్కూళ్లలో ప్రాథమిక తరగతులు వద్దు

73చూసినవారు
నంద్యాల: హైస్కూళ్లలో ప్రాథమిక తరగతులు వద్దు
రాష్ట్రంలోని 900 ఉన్నత పాఠశాలల్లో 117 రద్దు చేసి 3,4,5 తరగతులను కొనసాగిస్తూ కొత్తగా 1,2 తరగతులను కూడా విలీనం చేస్తామని విద్యాశాఖ చెబుతోందని, ఇది ఎంత వరకు సబబు అని ఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గోర్ల సుధాకర్ బుధవారం నంద్యాలలో అన్నారు. గత ప్రప్రభుత్వం 3,4,5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయటంతో ప్రాథమిక విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందని, ఇలా చేస్తే ప్రాథమిక విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్