సెక్షన్ 22 ఏ1 భూములు, చుక్కల భూముల పరిష్కారం పై స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ తో కలిసి సెక్షన్ 22 ఏ1 భూములు, చుక్కల భూములు నిషేధిత జాబితాలో నుండి తొలగింపుపై జిల్లాస్థాయి సమావేశం జరిగింది.