

అమరావతిలో భూసేకరణ.. రైతుల ఆందోళన (వీడియో)
AP: రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం అమరావతిలో ఫేజ్-2 భూసేకరణ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో భూములు ఇచ్చేది లేదని గ్రామసభకు వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్‌కు స్పష్టం చేశారు. అటు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో తమ భూములు ఇవ్వమని 16 గ్రామాల ప్రజలు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.