ఏప్రిల్ 14 వ తేదీన (సోమవారం) భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా (ప్రభుత్వ సెలవు దినం) " ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంను రద్దు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసలతో జిల్లా ఎస్పీ "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక " కార్యక్రమానికి రావొద్దని తెలిపారు.