నంద్యాల: వైభవోపేతంగా రథసప్తమి వేడుకలు

68చూసినవారు
నంద్యాల: వైభవోపేతంగా రథసప్తమి వేడుకలు
నంద్యాల భగవత్ సేవా సమాజ్ ప్రాంగణంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి, అష్టదళ పాద పద్మారాధన సేవ అనంతరం, సూర్య ఆరాధనలు, కార్యసిద్ధి గణపతి హోమం, దశభుజ గణపతి హోమం, శ్రీ ధన్వంతరి హోమం, శ్రీ సుదర్శన హోమం, అరుణ హోమం, ఇత్యాది హోమాల తరువాత మహా పూర్ణాహుతి పిదప మహా మంగళ నీరాజనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్