నంద్యాల: ఎన్టీఆర్ అవార్డు స్వీకరించిన మాజీ సర్పంచ్ ను సత్కరించిన రోటరీ క్లబ్

66చూసినవారు
నంద్యాల మండలంలోని మునగాల గ్రామ మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి ఎన్టీఆర్ అవార్డును స్వీకరించిన నంద్యాల జిల్లా మొదటి వ్యక్తి అని రోటరీ సభ్యులు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ భవన్లో అధ్యక్షులు మోహన్ రెడ్డి, కార్యదర్శి బాలకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రామచంద్రారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఏడు పదుల వయసులోనూ సేవా కార్యక్రమాల్లో ముందుంటారని పిడిజి కల్లూరి రామలింగారెడ్డి తెలిపారు. వ్యాపార రంగంలో, సేవా కార్యక్రమాల్లో, దాతృత్వంలో వారికి వారే సాటి అని తెలిపారు.

సంబంధిత పోస్ట్