నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో బాల భవన్ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. బాల భవన్ సూపరిండెంట్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.