నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కు మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని కోరుతూ శనివారం నిరసన చేపట్టారు. హాస్పటల్ ఆవరణంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు నాగన్న అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా కార్యదర్శి బాల వెంకట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ కార్యదర్శి చెన్నయ్య మాట్లాడుతూ మూడు నెలలుగా వేతనాలు లేక కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.