నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు శక్తి టీం నోడల్ అధికారి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు పర్యవేక్షణలో జిల్లాలోని వివిధ స్కూల్, కాలేజీలు, ముఖ్యమైన కూడళ్ళు , షాపింగ్ మాల్స్ మొదలగు ప్రాంతాలలో శక్తి టీం బృందాలు విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు శక్తి యాప్, ఫోక్సో చట్టం, మహిళలపై జరిగే నేరాల గురించి అత్యవసర సమయంలో వినియోగించవలసిన టోల్ ఫ్రీ నంబర్ల గురించి అవగాహన శుక్రవారం కల్పించారు.