నంద్యాల పోలూరు రోడ్డులోని జీవనజ్యోతి అంధుల వసతి గృహంలో శనివారం రాష్ట్ర స్థాయి అంధుల చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు లూయీ బ్రెయిలీ అంధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెస్ సంఘం సమన్వయంతో శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ ఈ వివరాలు వెల్లడించారు.