నంద్యాలలోని టెక్కే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న గోలి సోడా గోడౌన్ పై ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట రాముడు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీలో బాగంగా గోలి సోడా గోడౌన్ లో తనిఖీలు నిర్వహించామని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎండ తీవ్రతతో ప్రజలు ఎక్కువగా డ్రింక్స్ సేకరిస్తున్నారని, ప్రజలు స్వీకరించే ఏ డ్రింక్స్ అయినా ఆహార భద్రత నియమానికి కట్టుబడి ఉండాలన్నారు.