రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శనివారం నంద్యాల, పాణ్యం మార్కెట్ యార్డులో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. డిపిఓ శివారెడ్డి, తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.