డోన్ తాలూకాలో భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి ప్రాణాలు అర్పించిన అమరజీవి నక్కి రామన్న 35వ వర్థంతిని నంద్యాల సిపిఐ కార్యాలయమైన స్వామిరెడ్డి భవన్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కమ్రేడ్ రామన్న ఆశయాలను స్మరించుకుంటూ యువత రక్తదానంలో పాల్గొనడం జరిగింది.